కంకర రాళ్లకు బంగారం పూత పూసి మోసం.. అప్పు పేరుతో రూ.1.30 లక్షలు కాజేసిన వ్యక్తి

నిజామాబాద్: కంకర రాళ్లకు బంగారం పూత పూసి అసలైన బంగారం అంటూ నమ్మించి మోసానికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని హమాల్వాడీకి చెందిన రమేష్ వద్ద శ్రీనివాస్ రూ.1.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని రమేష్ ఒత్తిడి చేయడంతో, తనకు గుప్తనిధులు దొరికాయని, అందులో బంగారు రాళ్లు ఉన్నాయని నమ్మించాడు.

అప్పుకు బదులుగా బంగారు రాళ్లను తీసుకోవాలని చెప్పిన శ్రీనివాస్.. డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్‌కు రావాలని, అదనంగా రూ.32 వేల నగదు కూడా తీసుకురావాలని రమేష్‌ను కోరాడు. అక్కడ నాలుగు కుండల్లో ఉన్న నాలుగు రాళ్లను బంగారం అంటూ అప్పగించాడు.

అయితే రాళ్లపై అనుమానం రావడంతో పరిశీలించిన రమేష్.. అవి కేవలం కంకర రాళ్లకు బంగారం రంగు పూత పూసినవేనని గుర్తించాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Back to list
Next అమరావతి: ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి వరి మినహా అన్ని నోటిఫై చేసిన పంటలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జూలై 31తో ముగియాల్సిన గడువును రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో 15 రోజుల పాటు పొడిగించినట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావం వంటి కారణాలతో పంట నష్టం జరిగితే ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా కీలకమని మంత్రి పేర్కొన్నారు. రుణగ్రహీతలు, రుణేతర రైతులు అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి రైతు ఆగస్టు 15లోగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని సూచించారు. సంబంధిత బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (CSCలు), రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ లేదా వ్యవసాయ శాఖ అధికారుల సహాయంతో నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు విజ్ఞప్తి చేశారు.రైతులకు శుభవార్త.. ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *