చిన్నారుల వార్డులో షార్ట్‌సర్క్యూట్.. 5 రోజుల శిశువు మృతి

ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

చిన్నారుల వార్డులో షార్ట్‌సర్క్యూట్.. 5 రోజుల శిశువు మృతి

24 మంది చిన్నారులను తరలింపు.. ముగ్గురి పరిస్థితి విషమం

ఆదిలాబాద్, సెప్టెంబర్ 22: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న షార్ట్‌సర్క్యూట్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఎస్ఎన్‌సీయూ (ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ) వార్డులో విద్యుత్ సంబంధిత ఘటనతో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అక్కడ ఉన్న తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పొగలు కమ్ముకోవడంతో తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని బయటకు పరుగులు తీశారు. ఘటన అనంతరం విద్యుత్ సరఫరాను నిలిపివేసిన సిబ్బంది చిన్నారులను సురక్షితంగా పక్క వార్డుకు తరలించారు.

ఈ ఘటనలో ఐదు రోజుల వయసున్న శిశువు మృతి చెందినట్లు సమాచారం. మరో 24 మంది చిన్నారులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా రిమ్స్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న కూడా ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ఘటనకు గల పూర్తి కారణాలు, శిశువు మృతికి సంబంధించిన వైద్యపరమైన వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

నారుపల్లి శివదస్తగిరి రెడ్డి (CEO) : 8686186039

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *