ఫోన్ EMI చెల్లించలేదని యువకుడి కిడ్నాప్.. రక్తం విక్రయించిన నిందితులు

ఫోన్ EMI చెల్లించలేదని యువకుడి కిడ్నాప్.. రక్తం విక్రయించిన నిందితులు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

లక్నో, సెప్టెంబర్ 22: ఫోన్‌ EMI చెల్లించలేదనే కారణంతో ఓ యువకుడిని కిడ్నాప్ చేసి నాలుగు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వెలుగుచూసింది. అంతేకాకుండా బాధితుడిని బ్లడ్ బ్యాంక్‌కు తీసుకెళ్లి అతని రక్తాన్ని విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.

నవల్‌కుమార్ అనే యువకుడు గీతా మొబైల్ షాప్‌లో EMI విధానంలో ఓ మొబైల్ ఫోన్ కొనుగోలు చేశాడు. అయితే కొన్ని సమస్యల కారణంగా ఒక EMI చెల్లించలేకపోయాడు. దీంతో అతనికి ‘గుణపాఠం చెప్పాలనే’ ఉద్దేశంతో ఇద్దరు వ్యక్తులు నవల్‌కుమార్‌ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

కిడ్నాప్ చేసిన అనంతరం నాలుగు రోజుల పాటు అతడిని తమ అదుపులో ఉంచుకుని వేధించినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడిని బ్లడ్ బ్యాంక్‌కు తీసుకెళ్లి రక్తాన్ని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని అనికేత్ సింగ్ అలియాస్ కాకా (26), సుశాంత్ శర్మ (31)గా గుర్తించారు.

EMI చెల్లించకపోవడంతో నవల్‌కుమార్‌కు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే కిడ్నాప్ చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *