బద్వేలు టీడీపీలో మరోసారి విభేదాల సెగ

బద్వేలు టీడీపీలో మరోసారి విభేదాల సెగ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

సోషల్ మీడియా వ్యాఖ్యలపై కార్యకర్తల ఆగ్రహం.. పోలీసులకు ఫిర్యాదు

బలిజ సామాజిక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్

కడప జిల్లా, పోరుమామిళ్ల: బద్వేలు టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రాష్ట్రస్థాయి నాయకుడిని ఉద్దేశించి సోషల్ మీడియాలో అనుచిత పదజాలంతో ప్రచారం చేయడంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ డైరెక్టర్ సాధన కారి రంతు వర్గానికి చెందిన కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి, కలసపాడుకు చెందిన ప్రహ్లాదరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ఎస్‌ఐకు వినతిపత్రం సమర్పించారు.

సోషల్ మీడియాలో రాష్ట్ర నాయకుడిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణమైందని కార్యకర్తలు పేర్కొన్నారు. అలాగే బలిజ సామాజిక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

బలిజ సామాజిక వర్గంపై చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను బద్వేలు టీడీపీ ఇన్‌చార్జి సూర్యనారాయణరెడ్డి ఖండించాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. సామాజిక వర్గాల మధ్య విభేదాలు తలెత్తేలా వ్యాఖ్యలు చేయకుండా పార్టీ నాయకత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బద్వేలు టీడీపీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలపై మరోసారి చర్చ మొదలైంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *