ప్రొద్దుటూరులో PMAY-Urban 2.0 పట్టాల పంపిణీ.. పేదల సొంతింటి కల సాకారం: ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరులో PMAY-Urban 2.0 పట్టాల పంపిణీ

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రొద్దుటూరు: వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని సాంబయ్యగారి వీధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ‘పీఎంఏవై (అర్బన్) 2.0 పథకం’ కింద పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారులకు మంజూరు పత్రాల (పట్టాల) పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ హాజరయ్యారు. అర్హులైన లబ్ధిదారులకు వారు స్వయంగా మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలవుతున్న పీఎంఏవై (అర్బన్) 2.0 పథకం ద్వారా లబ్ధిదారులు తమ సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు.

లబ్ధిదారులు గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకునేలా అవసరమైన సహకారం అందించాలని అధికారులకు సూచించారు. గృహ నిర్మాణ పనులకు సంబంధించి మున్సిపల్ యంత్రాంగం, గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌తో పాటు సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *