పులివెందుల: ప్రముఖ వైద్యులు, దివంగత డాక్టర్ ఈసీ గంగిరెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఆయన సమాధి వద్ద నివాళులర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి హాజరై గంగిరెడ్డి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా గంగిరెడ్డి సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్థానికులు, అభిమానులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: