ప్రొద్దుటూరు: జల జీవన్ మిషన్ – అమరజీవి జలధార శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రొద్దుటూరుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చాపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీరామ వంశీ ఘన స్వాగతం పలికారు.
హెలిప్యాడ్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రానున్న స్థానిక ఎన్నికలు, చాపాడు మండలంలో జనసేన పార్టీ బలోపేతం, పార్టీ కార్యకలాపాల విస్తరణ తదితర అంశాలపై శ్రీరామ వంశీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు.
స్థానికంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలను కూడా ఆయన వివరించినట్లు తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: