హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 1,481.780 గ్రాముల బంగారం పట్టుబడగా.. దాని విలువ సుమారు ₹2.25 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. ఆరు బంగారం ముక్కలు బయటపడ్డాయి. బంగారాన్ని బ్లూ టేప్, కార్బన్ పేపర్‌తో చుట్టి, దుస్తుల కింద ప్రత్యేకంగా రూపొందించిన పౌచ్‌లో దాచినట్లు గుర్తించారు.
నిర్దిష్ట సమాచారం ఆధారంగా డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. విదేశీ ప్రయాణ సమయంలో విమానంలోనే బంగారాన్ని దాచినట్లు, అనంతరం హైదరాబాద్‌కు వచ్చే దేశీయ ప్రయాణంలో దాన్ని బయటకు తరలించేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
విమానంలో దాచిన బంగారాన్ని తానే తీసుకున్నట్లు ప్రయాణికుడు విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. కస్టమ్స్ యాక్ట్–1962 కింద బంగారాన్ని సీజ్ చేసి, అక్టోబర్ 6న ప్రయాణికుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: