రాజంపేట: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు.
విజయవాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూండ్ల రమణారెడ్డి, రాము యాదవ్ టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కార్యక్రమంలో టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి దొంతం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజంపేటలో రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ ఈ చేరికలు చోటుచేసుకున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పక్షాలు సమన్వయంతో సిద్ధమవుతున్నట్లు ఇటీవలి నివేదికలు పేర్కొంటున్నాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip: