Tv424x7
Telangana

సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం సచివాలయం (Secretariat)లో కీలక సమీక్ష (Review) నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరనున్నారు..వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tumma Nageswararao)తో కలిసి సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటు ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించనున్నారు.రుణమాఫీకి కార్యాచరణ మొదలురుణమాఫీకి (Loan waiver) కార్యాచరణ మొదలుపెట్టనున్నారు. డెడ్ లైనుకు ముందే రుణమాఫీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఛాలెంజ్‌ను నెరవేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై ఏడు లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందుకోసం రూ. 32 వేల కోట్ల వరకు ప్రభుత్వనికి నిధులు అవసరమవుతాయి. త్వరలో రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా ఆర్బీఐ నిబంధలకు లోబడి ఎఫ్ఆర్బిఎం పరిధిలో లోన్ తీసుకొనేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాధ్యా సాధ్యాలపై ఈరోజు బ్యాంకర్లు , వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 నుంచి రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు..కాగా బుధవారం నుంచి పరిపాలనపై దృష్టి పెడతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న (మంగళవారం) చిట్ చాట్‌లో తెలిపిన విషయం తెలిసిందే.. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర పైనే ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం ఉంది. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేయనున్నారు. మిల్లర్లు మింగి కూసుంటాం అంటే చూస్తూ ఊరుకోనని రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని వెల్లడించారు కూడా.. విద్యుత్ శాఖలో కొందరు కావాలని పవర్ కట్ చేస్తున్నారని, వారిపై చర్యలు ఉంటాయని రేవంత్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం.. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. నేటి నుంచి పరిపాలనపై పూర్తి స్థాయి చర్యలు ఉంటాయన్నారు..

Related posts

పేద విద్యార్థి ఉన్నత చదువులకు ఎంపీ డా. కడియం కావ్య , ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆపన్నహస్తం

TV4-24X7 News

కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా?

TV4-24X7 News

పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

TV4-24X7 News

Leave a Comment