తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులా హెపటైటిస్ విస్తరిస్తోంది. తీవ్రమైన కాలేయ వ్యాధికి ఇది కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, కోనసీమ, విశాఖ జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఏపీలో ఒక్క ఫిబ్రవరి నెల రెండో వారంలోనే 266 హెపటైటిస్ కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో ఈ వైద్య పరీక్షలు చేసిన దాదాపు ప్రతి 235 మందిలో ఒకరికి ఉన్నట్లుగా గుర్తించారు.
హెపటైటిస్ వైరస్‌ల వ్యాప్తిశరీరంలో నిద్రాణంగా దాగి ఉన్న హెపటైటిస్ వైరస్‌లు కాలేయానికి పెనుముప్పు తెస్తున్నాయి. రక్త మార్పిడి, లైంగిక సంపర్కం, సిరంజ్‌ల వినియోగంలో సురక్షిత విధానాలు అవలంబించకపోవటం వంటివి ఈ వైరస్‌ల వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి. వైరల్ హెపటైటిస్ కలుషిత సూదులు, లేదంటే రక్తం ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అధిక ఆల్కహాల్ వాడకం, టాక్సిన్స్, కొన్ని మందుల వల్ల కూడా హెపటైటిస్ రావచ్చు.