విశాఖపట్నం శంకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారి సహకారంతో, ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించబడింది. ప్రతి సంవత్సరం మూడు సార్లు ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 500 మంది పాల్గొన్నారు, కంటి ఆపరేషన్లకు 50 మంది ఎన్నికయ్యారు, వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్ పేషెంట్లను తనిఖీ చేసి, ఉచితంగా మందులను అందించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్. కృష్ణ, చాందిని, శాంతి, సౌజన్య, లతా, క్యాంపు కోఆర్డినేటర్ వై . రాజు, సంస్థ అధ్యక్షులు అప్పారావు, సంస్థ మహిళా సభ్యులు పాల్గొన్నారు.
