Tv424x7
Andhrapradesh

శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలు

విశాఖపట్నం శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఫాదర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివేకానంద సంస్థ అనాధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తండ్రులను,సి హెచ్ . సూర్యనారాయణ, నాగేశ్వరరావు ను వివేకానంద సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్.సి .ఎం .ఎ . జహీర్ అహ్మద్ సాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు కూడా మనకి జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలని, ఫాదర్స్ డే సందర్భంగా ఈ తండ్రులకు సన్మానం చేయడం, నా అదృష్టంగా భావిస్తున్నానని, ఎంతోమంది తల్లిదండ్రులకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి భరోసాగా నిలబడ్డ సంస్థ వారిని, సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు అప్పారావు , సంస్థ సభ్యులు అప్పలకొండ, సోంబాబు మరియు సంస్థ మహిళా సభ్యులు ఉమాదేవి, రాణి, రత్న, సుజాత , ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

అయ్యప్ప సేవ సమితి ఆధ్వర్యంలో బుధవారం అయ్యప్ప స్వామి గ్రామోత్సవం

TV4-24X7 News

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

TV4-24X7 News

విచారణకు హాజరు కాలేను: నటి హేమ

TV4-24X7 News

Leave a Comment