విశాఖపట్నం రోటరీ క్లబ్, విశాఖపట్నం సభ్యులు, ప్రముఖ సంఘ సేవకురాలు మయాంక్. కుమారి, శక్తి విక్రం దేవ్ జ్ఞాపకార్థం వివేకానంద అనాధ ఆశ్రమమునకు అన్నదాన నిమిత్తం 25000/- విలువచేసే 8 బస్తాల బియ్యం, ఆయిల్, చింతపండు, కందిపప్పు, కారం, ఉప్మా రవ్వ, సబ్బులు, పేస్టులు మొదలైన నిత్యవసరాలను అందించారు. ఆమె ఆశ్రమ వాసులతో కొంత సమయం గడిపి వారి యోగక్షేమాలను కనుక్కున్నారు, ఈ నెల 4 వ తేదీన తిరుపతి, అరుణాచలం యాత్రలకు బయలుదేరుతున్నారని తెలుసుకొని చాలా సంతోషించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుల అప్పారావు, మయాంక్. కుమారి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వివేకానంద సంస్థ వారు ప్రతిరోజు నిత్య అన్నదానాలకు, గోషా హాస్పిటల్ లో భోజనాల పంపిణీకి ఇలా దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ విశాఖపట్నం ప్రెసిడెంట్ వినయ్ గాంధీ, సెక్రటరీ మణిమాల, పాల్గొన్నారు.

previous post