Tv424x7
Andhrapradesh

హెల్మెట్ తప్పనిసరి వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది

విశాఖపట్నం ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు తప్పక పాటించాలని తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ కొత్త రోడ్ చెకింగ్ చేశామన్నారు. ఈ సందర్భంగా ఏసీపీ ట్రాఫిక్ జోన్ -1, ట్రాఫిక్ ఎస్ఐ విశ్వనాథ్ ఇతర పోలీస్ సిబ్బంది మైకుల ద్వారా వాహన చోదకులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. వాహన చోదకులు తప్పకుండ హెల్మెట్ ధరించాలని, కార్ డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా రోడ్డు పై వాహనాలు నడుపరాదని, త్రిబుల్ రైడింగ్ నేరమని, ఆటో డ్రైవర్లు ఓవర్ లోడ్ ఎక్కించరాదని కోరారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు పాటించిన వారికి చాకోలెటీస్ ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమం లో ట్రాఫిక్ ఎస్ఐ విశ్వనాధ్, హెడ్ కానిస్టేబుల్ శివ ప్రసాద్, మూర్తి, హోంగార్డ్ ఉదయ్, హోంగార్డ్ సరస్వతి ,ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

గంజాయి పట్టించిన వారికి బంపర్ ఆఫర్

TV4-24X7 News

ఉచిత సిలిండర్ల అమలు అప్పటి నుంచే

TV4-24X7 News

టీటీడీ అధికారుల నిర్ణయానికి నో చెప్పిన ఛైర్మన్ బీఆర్ నాయుడు…

TV4-24X7 News

Leave a Comment