Tv424x7
Andhrapradesh

పగటిపూట రాత్రిపూట ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి గోపాలపట్నం పోలీస్ సిబ్బంది

విశాఖపట్నం వెస్ట్ సబ్ డివిజన్ సీఐ, ఎన్. శ్రీనివాసరావు గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ జి.తేజేశ్వరరావు వారి సిబ్బందితో కలిసి గోపాలపట్నం అజంతా పార్క్ ఏరియాలో నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు ఒక సదస్సు ఏర్పాటు చేసి, పగటిపూట రాత్రిపూట ఇంటి దొంగతనాలు జరిగే విధానం గురించి వివరించి, ప్రజలు ఇల్లు విడిచి వెళ్లేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి , పోలీసు వారికి ముందుగా సమాచారం ఎలా అందించాలి, ఎటువంటి ఆస్తి నష్టం కలగకుండా ఎలా జాగ్రత్త పడాలి అని అవగాహన సదస్సు కల్పించారు. అదేవిధంగా స్త్రీలు బయట ఒంటరిగా వెళ్లేటప్పుడు గొలుసు దొంగలు పట్ల ఎలా జాగ్రత్త వహించాలని వివరించినారు. నేర నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు చాలా ప్రాముఖ్యం వహిస్తాయిని ప్రజలందరూ తప్పనిసరిగా తమ ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, సూచించినారు.

Related posts

చిరంజీవిపై కోర్టుకెక్కిన మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా

TV4-24X7 News

పెద్దిరెడ్డి కుటుంబం అంతా “అడవిలో” ఇరుక్కున్నట్లే !

TV4-24X7 News

మంత్రి రజిని.. వ్యూహం ఫలించేనా.?

TV4-24X7 News

Leave a Comment