Tv424x7
Andhrapradesh

వైసిపి మాజీ మంత్రి విడుదల రజిని బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ*

అమరావతి : మాజీ మంత్రి విడదల రజనీ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఏపీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు తనను వేధించారంటూ కోటి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో విడదల రజనీపై కేసు నమోదైన సంగతి తెలసిందే. ఈ కేసులోనే ముందస్తు బెయిలు కోసం విడదల రజనీ హైకోర్టును ఆశ్రయిం చారు. రజనీ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవ్వాలా ధర్మాసనం విచారణ చేపట్టనుంది,తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి పిటిషన్ పై హైకోర్టు ఆదే శాల మేరకు చిలకలూరి పేట పోలీసులు మాజీ మంత్రి విడదల రజినీపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీకి సంబంధించి సోషల్ మీడి యా పోస్టుల విషయంలో విడదల రజినీ తనను వేధించారని పేర్కొంటూ తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు. పిల్లి కోటి పిటిషన్ ను పరిశీలించి కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని హైకోర్టు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో చిలకలూరి పేట పోలీసులు విడదల రజినీపై కేసు నమోదు చేశారు. విడదల రజినీతో పాటు ఆమె పీఏలు దొడ్డా రామకృష్ణ, ఫణి సహా అప్పటి సీఐ సూర్యనారా యణపై కూడా కేసు నమోదు అయ్యింది.

Related posts

గుజరాత్ లో మంగళ సూత్రాలు తెంచలేదా..? ప్రధాని మోదీపై షర్మిల విసుర్లు

TV4-24X7 News

ఉక్కు ప్రైవేటీకరణపై పవన్ క్లారిటీఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

TV4-24X7 News

35 వ వార్డు లో అంగన్వాడి భవనం ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment