Tv424x7
Andhrapradesh

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ -విధేయతకు పట్టం !

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. నామినేషన్ వేయమని ఆయనకు సమాచారం వచ్చినట్లుగా తెలుస్తోంది. రాయలసీమ రెడ్డి వర్గానికి ఈ సారి అవకాశం వస్తుందని చాలా మంది అనుకున్నారు. గత కొన్నాళ్లుగా రాయలసీమకు చాన్స్ దక్కడం లేదు. పదవులు కూడా కోస్తా ప్రాంతానికే ఇస్తున్నారు. కేంద్ర మంత్రి పదవులు, రాజ్యసభ పదవులు కూడా వారికే ఇస్తున్నారు. అధ్యక్ష పదవి కూడా.. రాయలసీమ ప్రాంత నేతకు ఇచ్చి దశాబ్దాలు అవుతోంది.అందుకే ఈ సారి కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ హైకమాండ్ వేరుగా ఆలోచించింది. మాధవ్ ..బీజేపీకి అత్యంత నమ్మకస్తుడు. ఆయన తండ్రి పీవీ చలపతిరావు ఆరేళ్ల పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. బీసీ వర్గానికి మాధవ్ కూడా చురుకైన నేతగా గుర్తింపు పొందారు. కూటమి పార్టీలను సమన్వయం చేసుకోవడంలో ఆయన సమర్థత చూపుతారని హైకమాండ్ భావించినట్లుగా తెలుస్తోంది.కిరణ్ కుమార్ రెడ్డి గత ఎన్నికలకు ముందుపార్టీలోకి వచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డిపై వైసీపీ ముద్ర ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఉండేవారని.. అమరావతిపై కించ పరిచే వ్యాఖ్యలు చేయడం.. ఇతర కారణాలతో ఆయన ఇమేజ్ దిగజార్చుకున్నారని చెబుతున్నారు. ఈ కారణంగా రాయలసీమ రెడ్డి నేతల కన్నా.. మళ్లీ కోస్తా నేతకే చాన్సివ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Related posts

విశాఖపట్నం: బ్రహ్మోత్సవ యజ్ఞోపవీతం ప్రత్యేక దర్శనం…

TV4-24X7 News

స్థానిక ప్రజలతో ముఖా- ముఖి కార్యక్రమం వన్ టౌన్ ఎస్ ఐ లక్ష్మణరావు

TV4-24X7 News

కళకళ లాడుతున్న సబ్ రిజిస్టర్ కార్యాలయం

TV4-24X7 News

Leave a Comment