మండపాల అనుమతుల కోసం వెబ్సైట్ తెచ్చిన సర్కార్ – మండపానికి వచ్చి నిరభ్యంతర పత్రం ఇవ్వనున్న పోలీసులు – ఆన్లైన్ ద్వారా అనుమతులు ఇవ్వడం పట్ల జనం హర్షం..రాష్ట్రంలో వినాయక చవితి సందడి మొదలైంది. బొజ్జ గణపయ్యను కొలువుదీర్చేందుకు మండపాలు సిద్ధమవుతున్నాయి. వాటి అనుమతులకు నిర్వాహకులు ఇబ్బందిపడకుండా సింగిల్ విండో విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకుని ఎలాంటి ఫీజు చెల్లించకుండా నిరభ్యంతర పత్రం పొందే ఏర్పాటు చేసింది. చాలా సులభంగా అనుమతులు వస్తున్నాయంటూ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కూటమి సర్కార్ మండపాల అనుమతి కోసం గణేష్ ఉత్సవ్ వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఈవెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.ఎలా అప్లై చేయాలంటే..?దరఖాస్తుదారుని పేరు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ , అడ్రస్, అసోసియేషన్ లేదా కమిటీ పేరువినాయక మండపం స్థలం, విగ్రహం ఎత్తు, అలాగే మండపం ఎత్తుఏ సబ్ డివిజన్, ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి వస్తుందిఉత్సవ కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లుగణేష్ నిమజ్జనం తేదీ, సమయం, వాహనం వివరాలు పూర్తి చేసి అప్లికేషన్‌ను సమర్పించాలి. తర్వాత పోలీసులు వచ్చి ప్రాంగణాన్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు.
నిబంధనలు పోలీస్ అనుమతి లేకుండా విగ్రహాలు, మండపాలు ఏర్పాటు చేయకూడదు.అనుమతులకు ఏ విధమైన చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.డీజేలు, అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టమ్‌లను ఉపయోగించకూడదు.’పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ వెబ్ సైట్‌కు వెళ్లాలి. ఫస్ట్ మొబైల్ నంబర్ లాగిన్ అయిన వెంటనే ఓటీపీ వస్తుంది. దాంట్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే సరిపోతుంది. ఆ వివరాలు అన్ని పోలీస్ స్టేషన్‌కు వస్తాయి. మేము వెళ్లి ఎటువంటి ఇబ్బందులు లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తాం. డీజే సిస్టమ్‌ను ఏవైడ్ చేయాలి.’ -సతీష్ కుమార్, గుంటూరు జిల్లా ఎస్పీ

