కాకినాడ తీరంలో మత్స్యకారుల వలలో అరుదైన చేపలు చిక్కి పెద్ద సంచలనంగా మారాయి. మొదట చూసినవారికి పాములా కనిపించినా… ఇవి నిజానికి చేపలేనని నిపుణులు తెలిపారు. స్థానికంగా వీటిని నల్ల బొమ్మిడాయిలు లేదా పాముచేపలు అని పిలుస్తారు.
ఆదివారం తెల్లవారుజామున సముద్ర యాత్రకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ సంఖ్యలో పాముచేపలు చిక్కాయి. అనంతరం వాటిని కుంభాభిషేకం రేవు వద్దకు తీసుకువచ్చి విక్రయించారు. అరుదైనవి కావడంతో చూసేందుకు స్థానికులు, కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సైజు ఆధారంగా కిలో ధర రూ.180 నుంచి రూ.250 వరకు పలికింది. పెద్దవాటికి అధిక ధర, చిన్నవాటికి తక్కువ ధర లభించిందని మత్స్యకారులు తెలిపారు. రుచికరమైన మాంసం, అరుదుగా దొరికే స్వభావం కారణంగా వీటికి మంచి గిరాకీ ఉంటుందని కొనుగోలు దారులు పేర్కొన్నారు.
ఈ అరుదైన పాముచేపలు తీరానికి చేరడంతో రేవు ప్రాంతం సందడిగా మారింది
అనూష

