ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సర్కిల్ పోలీస్ స్టేషన్లో బుధవారం క్రైమ్ రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ అన్సన్ అధ్యక్షతన నిర్వహించారు.
సమావేశంలో రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణ చర్యలపై సీఐ సిబ్బందితో చర్చించారు. రాత్రివేళల్లో దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించి రికార్డు చేయాలని సిబ్బందికి సూచించారు.
అలాగే పాఠశాలల్లో విద్యార్థులకు సైబర్ నేరాల అవగాహన, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఐ అన్సన్ ఆదేశించారు.

