Tv424x7
Andhrapradesh

బనగానపల్లె మండలంలో భారీ వర్షం ప్రభావం

బనగానపల్లె రూరల్‌ : బుధవారం సాయంత్రం బనగానపల్లె మండలంలో కురిసిన భారీ వర్షం రైతులను ఇబ్బందులకు గురి చేసింది. ముఖ్యంగా శివవరం గ్రామ దారి పక్కన ఉన్న పంట పొలాలు చెరువులను తలపించేలా నీటమునిగిపోయాయి. వరుసగా కురుస్తున్న వర్షం కారణంగా పొలాల్లోని నీరు బయటకు వెళ్లక పోవడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.రహదారులు జలమయమవడంతో గ్రామానికి వెళ్లే మార్గంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్లు నీటిలో ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది.రైతులు మాట్లాడుతూ – “ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల పంటలు పాడైపోతున్నాయి. పంట నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి సాయం అందించాలని” విజ్ఞప్తి చేశారు.

Related posts

కేపీజీ స్కూల్ పైన చర్యలు తీసుకోవాలి విద్యాశాఖ అధికారికి విద్యార్ధి సంఘాల పిర్యాదు

TV4-24X7 News

గ్రామపంచాయతీ ఎన్నికలకు సిద్ధం కండి…

TV4-24X7 News

మళ్లీ టీడీపీలోకి మాజీ నేతలు

TV4-24X7 News

Leave a Comment