నగరంలో జింక మాంసం అక్రమ రవాణా కలకలం రేపింది. టోలిచౌకిలో పోలీసుల ముఠా ప్రత్యేక నిఘా చర్యలో బట్టబయలు చేశారు.
పక్కా సమాచారం మేరకు మావిన్ క్లాసిక్ అపార్ట్మెంట్ వద్ద అర్ధరాత్రి సోదాలు నిర్వహించగా, 10 కిలోల జింక మాంసం, 3 జింక కొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బొలెరో వాహనం(AP09BT4716) ను సీజ్ చేశారు.
జింక మాంసం రవాణా చేస్తున్న మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇక్బాల్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం పొందిన మాంసం, వాహనాన్ని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. నిందితులపై వన్యప్రాణి రక్షణ చట్టం 1972 ప్రకారం కేసు నమోదు చేయగా, వారికి జరిమానా మరియు జైలు శిక్ష కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.
సౌత్వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ప్రజలకు, వన్యప్రాణుల రక్షణలో సహకరించాలని ఆకాంక్షించారు.

