Tv424x7
Andhrapradesh

నా బిడ్డను కాపాడండి సీఎం సారూ…అరుదైన వ్యాధితో బాధపడుతున్న నాగచైతన్య..

చికిత్సకు ప్రభుత్వం సహకరించాలి అని తల్లి సుమలత వేడుకుంటున్నది.


సుందుపల్లె మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన బోనంశెట్టి సుమలత తన 15 ఏళ్ల కుమారుడు నాగచైతన్యకి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నాగచైతన్య ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

పది రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో కుటుంబం రాయచోటిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. జ్వరం తగ్గకపోవడంతో, తర్వాత వేలూరు సి.ఎం.సి. ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, డాక్టర్లు అతనికి బోన్ బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించారు.

వైద్యుల ప్రకారం, చికిత్స ఖర్చు దాదాపు ₹60 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. నిరుపేద కుటుంబం ఆర్థికంగా భయంకర స్థితిలో ఉంది. భర్త కువైట్‌లో జీవనోపాధి కోసం పని చేస్తున్నాడు, కాబట్టి సుమలతకు ఇంకా సమస్యలు ఎదురవుతున్నాయి.

తన కుమారుడి కోసం సుమలత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారం కోరుతున్నారు. అలాగే, దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

Related posts

కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ పి..రంజిత్ భాషా

TV4-24X7 News

ఏపీలో డ్వాక్రా మహిళలకు రుణా అవకాశాలు!!

TV4-24X7 News

32వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టండి కార్పొరేటర్ కందుల నాగరాజు

TV4-24X7 News

Leave a Comment