Tv424x7
Sports

కుల్దీప్ మ్యాజిక్.. పీకల్లోతు కష్టాల్లో పాక్…

ఆసియా కప్‌–2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం జరుగుతున్న భారత్–పాకిస్తాన్ పోరులో పాకిస్తాన్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

భారత్ స్పిన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ స్పెల్‌తో పాక్ బ్యాటర్లను తిప్పికొడుతున్నాడు. అతని ఓవర్లో వరుస బంతులకు రెండు వికెట్లు పడిపోయాయి.

నాలుగో బంతికి హసన్ నవాజ్ (5) అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఐదో బంతికి మహ్మద్ నవాజ్ (0) LBWగా పెవిలియన్ చేరాడు.ఇప్పటికే కీలకమైన ఆరు వికెట్లు కోల్పోయిన పాక్ స్కోరు 13 ఓవర్లకు 65/6గా నిలిచింది.

భారత్ బౌలర్ల దాటికి పాక్ బ్యాటింగ్ వరుసగా కుప్పకూలుతుండగా, ప్రేక్షకులు ఆసక్తిగా మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు.

Related posts

T20WC: నేడే ఫైనల్

TV4-24X7 News

నేటి నుంచే టీమ్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్..!!

TV4-24X7 News

భారత్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఒమన్!

TV4-24X7 News

Leave a Comment