Tv424x7
Telangana

18 వరకు భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరిక 🌧️….

హైదరాబాద్‌:

తెలంగాణలో వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టంచేసింది. నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణ సమయానికి మూడు రోజుల ముందుగానే ఉపసంహరించుకోవడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొంది.

బంగాళాఖాతం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈనెల 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

ఆదివారం ఇప్పటికే భద్రాద్రి-కొత్తగూడెం, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని తెలిపింది.

సోమవారం కూడా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేశారు.

Related posts

మేడారం వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

TV4-24X7 News

తెలంగాణ స‌భా స‌మ‌రం ముహూర్తం రెడీ..!

TV4-24X7 News

9లక్షల మంది రైతులకు సర్కార్ గుడ్ న్యూస్….ఏంటో తెలుసా

TV4-24X7 News

Leave a Comment