సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి నోటిఫికేషన్
హైదరాబాద్ :
రాష్ట్రంలోని సుమారు 9 లక్షల మంది రైతులకు పెద్ద ఊరట లభించనుంది. భూ కొనుగోళ్ల ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో దశాబ్ద కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు మార్గం సుగమమైంది.
🔹 2016లో తొలిసారి సాదాబైనామాల క్రమబద్ధీకరణ చేపట్టి 12.64 లక్షల దరఖాస్తులు స్వీకరించగా, అందులో 6.18 లక్షల కేసులు క్రమబద్ధీకరించారు.
🔹 2020లో మళ్లీ దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, ఆర్వోఆర్-2020 చట్టంలో అవసరమైన సెక్షన్లు లేకపోవడంతో కోర్టు ప్రక్రియను నిలిపివేసింది.
అప్పట్లో వచ్చిన 9,00,894 దరఖాస్తులు పెండింగ్ అయ్యాయి.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్వోఆర్-2025 భూభారతి చట్టం తీసుకొచ్చి, ఇందులోని సెక్షన్-6 ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు చట్టబద్ధత కల్పించింది. విచారణ బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగించారు.
✅ క్రమబద్ధీకరణ పూర్తయిన వెంటనే రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ కానున్నాయి.
✅ దీంతో భూములపై న్యాయ సమస్యలు తొలగి, ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ద్వారా పెద్దఎత్తున ఆదాయం రానుంది.📌 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఈ నోటిఫికేషన్ రైతుల్లో ఆనందాన్ని నింపింది.
అనూష

