ప్రభుత్వం పాలు మీద వసూలు చేస్తున్న 5% జీఎస్టీని రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల పాల ధరలు లీటరుకు రూ.3 నుండి రూ.4 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా.
సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు అమల్లోకి రానున్నాయి. ఆ తర్వాత నుంచే మార్కెట్లో పాల ధరల్లో మార్పు చూడొచ్చు.
ఉదాహరణకు – ప్రస్తుతం లీటరు పాల ధర రూ.60 ఉంటే, కొత్త ధర రూ.57 అవుతుంది. రూ.80 ఉంటే రూ.76కి తగ్గవచ్చు.ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ద్రవ్యోల్బణ నియంత్రణలో భాగంగా, సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు తీసుకుంది.
డైరీ రంగం ప్రతినిధులు కూడా ఈ తగ్గింపుతో వినియోగదారులకు కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నారు.
అనూష

