విశాఖపట్నం :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు (సెప్టెంబర్ 17) విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. ఉదయం 11 గంటలకు అమరావతి నుంచి హెలికాప్టరులో బయలుదేరి విశాఖ హెలిప్యాడ్ చేరుకోనున్నారు.
తరువాత బీచ్ రోడ్డులోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మహిళల ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 వరకు నిర్వహించే ప్రత్యేక వైద్య శిబిరాలను సీఎం ప్రారంభించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్టులో జీసీసీ ఆధ్వర్యంలో జరిగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సదస్సులో సీఎం పాల్గొంటారు. అనంతరం విజయవాడకు బయలుదేరుతారు.

