Tv424x7
Andhrapradesh

ఘనంగా శ్రీ స్వామి వారి ఉట్లోత్సవం…

కదిరి

శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ వేడుకలను పురస్కరించుకుని, కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఉట్లోత్సవం సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించబడింది. గోకులాష్టమి ఆస్థానం నిర్వహణకు మరుసటి రోజు ఉట్లోత్సవం నిర్వహించడం ఆలయ సంప్రదాయం లో భాగం.

ఉత్సవంలో శ్రీ స్వామి వారిని ప్రత్యేక పల్లకీలో అలంకరించి ఆస్థాన పూజ అనంతరం, కౌవులేపల్లి వాస్తవ్యులు గంటేమ్ వంశస్థులు, మా మేనమామలు, మా అమ్మ కీ.శే. నచ్చు పాపులమ్మ (W/o కీ.శే. నచ్చు కొండప్ప యాదవ్) గారి నిర్మించిన దేవరిల్లు వద్ద ప్రత్యేక పూజలు నిర్వాహించబడ్డాయి.

అలాగే ఆలయ సిబ్బంది మార్యాదలతో, మేల తాళములతో ఊరేగింపు నిర్వహించి స్వామి వారి వద్దకు తీసుకువచ్చారు. ఊరేగింపు సందర్భంగా భక్తులు ఉత్సాహం, కోలాహలంతో పాల్గొన్నారు. భక్తులలో గంటేమ్ రామంజనేయులు యాదవ్, ప్రసాద్ యాదవ్, జయచంద్ర యాదవ్, నరేంద్ర యాదవ్, శ్రీకాంత్ యాదవ్, నచ్చు బాలకృష్ణ యాదవ్, జగన్ యాదవ్, లోకేష్ యాదవ్, భార్గవ్ యాదవ్, ప్రభాస్ యాదవ్ తదితరులు ముఖ్యంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భక్తులు స్వామి వారిని నీళ్లు చల్లుతూ, ఉట్టి కొట్టుతూ ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమం తీరుమాడవీధుల ఉత్సవంతో ఘనంగా ముగిసింది

Related posts

ప్రొద్దుటూరులో వాలంటర్ల రాజీనామా

TV4-24X7 News

ఇదేం రాక్షసత్వం… మా వాళ్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?: జగన్!!

TV4-24X7 News

భారత జట్టుకు అభినందనలు తెలిపిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

TV4-24X7 News

Leave a Comment