Tv424x7
Andhrapradesh

ప్రముఖ తెలుగు యూ ట్యూబర్ అరెస్ట్

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన కేసులో ప్రముఖ తెలుగు యూ ట్యూబర్ చంద్రశేఖర్ సాయికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని యువతిని మోసం చేసిన కేసులో ప్రముఖ తెలుగు యూ ట్యూబర్ చంద్రశేఖర్ సాయికిరణ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చంద్రశేఖర్ సాయికిరణ్ యూట్యూబర్ చందు గాడు పేరుతో ఫేమస్ అయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకోమంటే మూడు కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడని బాధిత యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా.. బాధితురాలి ఫిర్యాదుతో లైంగికదాడి, మోసం కింద కేసులు నమోదు చేశారు. పుట్టినరోజు వేడుకలకని బాధిత యువతిని పిలిచి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని యువతి ఫిర్యాదులో పేర్కోంది. చంద్రశేఖర్ తో పాటు ఆయన తల్లిదండ్రులు, మరో ఇద్దరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు

Related posts

సుపారీ ఇచ్చి తండ్రినే చంప్పించిన కూతురు

TV4-24X7 News

పాపం రా నా బిడ్డ..విజయమ్మ లేఖ

TV4-24X7 News

విజయవాడ–సింగపూర్ నూతన నేరుగా విమాన సర్వీస్ ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment