Tv424x7
National

22 ఏళ్ల బీహార్ యువకుడు సినిమా పైరసీ హ్యాకింగ్ రాకెట్‌లో!!

పాట్నా: సినిమా పరిశ్రమకు చెక్ పెట్టేలా సినిమా పైరసీతో వణికించిన 22 ఏళ్ల బీహార్ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హ్యాకింగ్ నైపుణ్యంతో ముందస్తే సినిమాలను డౌన్లోడ్ చేసి, క్రిప్టో కరెన్సీ ద్వారా అమ్మి లక్షల డాలర్లు సంపాదించినట్లు వెల్లడయింది.

అశ్వనీకుమార్ (22), పాట్నాకు చెందిన ఇంటర్ చదివిన యువకుడు, సినిమాలపై పూర్తి ప్రావీణ్యం చూపి, “హిట్ 3” మూవీని రిలీజ్‌కి 18 గంటల ముందే HD ప్రింట్‌ను విడుదల చేసినట్లు తెలుస్తోంది. సంక్రాంతి, థండేల్, గేమ్ చేంజర్ వంటి సినిమాలను 4RABET సంస్థకు అమ్మి, ఫైనాన్స్ ద్వారా పెద్ద మొత్తంలో లాభం పొందాడు.

అశ్వనీకుమార్ తన హ్యాకింగ్ నైపుణ్యంతో ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ మరియు భారత ప్రభుత్వ పలు వెబ్‌సైట్లను కూడా హ్యాక్ చేసి ఉద్యోగుల జీతాలు, వ్యక్తిగత వివరాలను సేకరించినట్లు పోలీసులు గుర్తించారు.

జానా కిరణ్ కుమార్ అనే వ్యక్తిని క్రిప్టో పేమెంట్స్ ట్రాకింగ్ ద్వారా అరెస్ట్ చేసిన పోలీసులు, తర్వాత అశ్వనీకుమార్‌ను పట్టుకున్నారు. యువకుడు తన ఇంటి చుట్టూ 22 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, పోలీసులు రాకను గమనించి, ఫోన్ మరియు హార్డ్ డిస్క్ డేటాను డిలీట్ చేయడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ, పోలీసులు ఆ సమయంలో దానిని నిలిపి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

సినిమా పరిశ్రమలో హ్యాకింగ్, పైరసీ నిషేధానికి ఇది మరొక హెచ్చరికగా మారింది.

Related posts

2 వేలమంది పోలీసులతో మోదీకి భద్రత

TV4-24X7 News

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాల్సిందే..

TV4-24X7 News

త్వరలోనే పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు!

TV4-24X7 News

Leave a Comment