Tv424x7
National

FMAE నేషనల్ స్టూడెంట్స్ మోటర్ స్పోర్ట్స్ కాంపిటీషన్‌కు ముఖ్య అతిథిగా కేటీఆర్!!


కోయంబత్తూరులోని కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్ వేదికగా అక్టోబర్ 11న FMAE నేషనల్ స్టూడెంట్స్ మోటర్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఘనంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న 101 కాలేజీలకు చెందిన సుమారు 1,300 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొననున్నారు. విద్యార్థులు స్వయంగా రూపొందించిన వాహనాలు, సాంకేతిక ఆవిష్కరణలను ఈ వేదికపై ప్రదర్శించనున్నారు.

ఈ పోటీల ద్వారా యువ ఇంజినీర్ల సృజనాత్మకత, సాంకేతిక ప్రతిభ ప్రపంచానికి తెలియజేయడం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. మోటర్‌స్పోర్ట్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ రంగాల్లో విద్యార్థులకు ఇది విలువైన అనుభవాన్ని కల్పించనుంది.

Related posts

ప్రధాని మోదీ అమరావతి టూర్ – సభకు 5 లక్షల మంది , 6600 బస్సులు

TV4-24X7 News

సుప్రీంకోర్టు,రాష్ట్రపతి మధ్య విభేదలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు !

TV4-24X7 News

ఆర్‌బీఐ గవర్నర్‌గా సంజయ్‌ మల్హోత్రా

TV4-24X7 News

Leave a Comment