Tv424x7
Andhrapradesh

ఇష్టానుసారం చెట్లు నరికివేత వాల్టా యాక్ట్ నిబంధనలు పట్టించుకోని వైనం

..పట్టించుకోని రెవెన్యూ, పి ఆర్ శాఖ అధికారులు..పులివెందుల. జీవకోటికి మనుగడకు కారణమయ్యే చెట్లను ఇష్టానుసారం నరికి వేస్తున్నారు. మానవాళికి ఊపిరిని అందించే చెట్లు ఇష్టానుసారం నరికి వేయకుండా నిబంధనలు తెచ్చి వాల్టా యాక్ట్ ప్రవేశపెట్టారు. దీని ప్రకారం చిన్న చెట్టును కూడా అనుమతి లేనిదే తొలగించడం నరికి వేయడం లాంటివి చేయకూడదు. కానీ చిన్న చిన్న పనులకు సైతం పురాతన చెట్లను కూడా నరికి వేయడం జరుగుతుంది. దీనివల్ల రాను రాను ఆక్సిజన్ శాతం తరిగిపోయి వాతావరణ కాలుష్యం పెరుగుతున్నదని అందరికీ తెలిసిందే. చెట్లు నాటండి అవి మనల్ని బ్రతికిస్తాయి అంటూ అధికారులు ప్రజాప్రతినిధులు అంటూ సభలు సమావేశాలు ర్యాలీల లో ఊదరగొడుతుంటారు. ఆ తర్వాత అవన్నీ ప్రకటనలకి పరిమితమవుతాయి అని మరోసారి నిరూపితమైంది. ఇది ఎక్కడో కాదు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రమైన పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లె లో కనిపిస్తుంది. ఇటీవల ఆ గ్రామంలో బాలికల వసతి గృహం ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇటీవల అక్కడ ఉన్న ఎస్టీ హాస్టల్ భవనానికి మరమ్మతులు చేయించి అందులో వసతి గృహం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆమేరకు మరమ్మతులు చేస్తున్నారు. అయితే హాస్టల్ లోపల పెద్ద పెద్ద చెట్లు అడ్డు వస్తున్నాయని నరికేశారు. అయితే ఇదంతా అధికారుల కనుసననలలోనే జరుగుతోందని స్పష్టమైనది. దీంతో వాల్టా యాక్ట్ అమలు జరగలేదని స్పష్టమవుతోంది. దీనిపై ఏ ఎస్ డబ్ల్యూ ఓ రామాంజనేయులు వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కాంట్రాక్టర్ చెట్లను నరికి వేశారని తెలిపారు.

Related posts

బొప్పాయి ధరలు పడిపోతే మాకు బతుకు లేదు” – పురుగుమందు సీసాలతో ఆవేదన వ్యక్తం చేసిన రైతులు

TV4-24X7 News

అరబిందో వారసుడ్ని మళ్లీ జైలుకు పంపుతున్న వి.సా.రెడ్డి..!

TV4-24X7 News

జగన్ కు హాని కలిగేలా ప్రవర్తించను: విజయసాయి

TV4-24X7 News

Leave a Comment