Tv424x7
Telangana

కలెక్టరేట్‌లో కామాంధుడు..!

హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు

హనుమకొండ:జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఘోర సంఘటన వెలుగుచూసింది. ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇర్ఫాన్ సోహెల్ అనే ఉద్యోగి మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నం చేసిన ఘటన కలెక్టరేట్‌లో కలకలం రేపింది.

బాధితురాలు ధైర్యం చేసి అధికారులకు, అనంతరం సుబేదారి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు లైంగిక వేధింపులు మరియు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.

కలెక్టరేట్‌ పరిధిలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం స్థానిక ఉద్యోగుల్లో ఆందోళనకు దారి తీసింది. పలువురు మహిళా సిబ్బంది కూడా ఇర్ఫాన్ సోహెల్ గతంలోనూ అనుచితంగా ప్రవర్తించేవాడని చెబుతున్నారు.

ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టగా, బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ ఘటనపై జిల్లా పరిపాలన విభాగం కూడా అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం.

Related posts

ఇక నుంచి సీబీఐ కోర్టులో జగన్ కేసుల రోజువారీ విచారణ

TV4-24X7 News

అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

TV4-24X7 News

లేబర్ కమిషనర్ దృష్టికి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు

TV4-24X7 News

Leave a Comment