Tv424x7
Andhrapradesh

మద్యం కుంభకోణంపై సిట్ దూకుడు — వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లలో సోదాలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14:వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నివాసాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక విచారణ బృందం (SIT) సోదాలు నిర్వహించింది. రాష్ట్రంలో వైకాపా హయాంలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.సిట్ అధికారులు హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ ప్రశాసన్ నగర్, యూసుఫ్‌గూడ గాయత్రీ హిల్స్ ప్రాంతాల్లో ఉన్న మిథున్ రెడ్డి నివాసాలను మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో బెంగళూరులోని ఆయన ఇల్లు వద్ద కూడా సోదాలు సాగాయి.విచారణ బృందం మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి, పత్రాలు, బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల రికార్డులు పరిశీలించినట్లు సమాచారం. సిట్ అధికారులు ఈ సోదాలపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మద్యం కుంభకోణం విచారణలో ఇవి కీలక పరిణామాలుగా భావిస్తున్నారు.మిథున్ రెడ్డి సన్నిహితులు అయితే, తమ కుటుంబం ఎటువంటి అక్రమాలలో పాల్గొనలేదని, ఇది రాజకీయ ప్రేరిత చర్య అని వ్యాఖ్యానిస్తున్నారు.

📍 మద్యం కుంభకోణం కేసులో మరిన్ని కీలక నేతల నివాసాలపై కూడా సిట్ దృష్టి ఉన్నట్లు తెలుస్తోంది.

Related posts

కోట శ్రీనివాసరావు కన్నుమూత

TV4-24X7 News

విశాఖలో మూడు రోజుల పాటు “సేనతో సేనాని”

TV4-24X7 News

తెలుగురాష్ట్రాల్లో విజృంభిస్తున్న హెపటైటిస్

TV4-24X7 News

Leave a Comment