ఆంధ్రప్రదేశ్ వైద్య రంగానికి మరో ముఖ్యమైన పురోగతి.వైఎస్ జగన్ ప్రభుత్వం కాలంలో స్థాపించిన కొత్త మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు మంజూరయ్యాయి.
జాతీయ వైద్య మండలి (NMC) మొత్తం ఐదు కాలేజీలకు 60 పీజీ సీట్లు అనుమతించింది.
🔸 మచిలీపట్నం – 12 సీట్లు
🔸 నంద్యాల – 16 సీట్లు
🔸 విజయనగరం – 12 సీట్లు
🔸 రాజమండ్రి – 16 సీట్లు
🔸 ఏలూరు – 4 సీట్లు
ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం కాలేజీలు నిర్మించలేదనే ఆరోపణలను ఈ నిర్ణయం తిప్పికొట్టినట్టైంది.
ఇప్పటికే ప్రతి కాలేజీకి 150 ఎంబీబీఎస్ సీట్లు మంజూరైన నేపథ్యంలో, ఇప్పుడు పీజీ సీట్లు కూడా లభించడం వైద్య విద్యకు పెద్ద ఊతం ఇవ్వనుంది.
వైద్య రంగంలో నాణ్యతా అభివృద్ధికి ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

