ఆ ఎమ్మెల్యే వింత పోకడ.. యాడ్స్ ఇచ్చి డబ్బులు చెల్లించని వ్యవహారం చర్చనీయాంశం!ప్రకాశం జిల్లా రాజకీయ వర్గాల్లో ఈ మధ్య ఒక ఎమ్మెల్యే ప్రవర్తన పెద్ద చర్చకు దారి తీసింది. గత రెండు సంవత్సరాలుగా వివిధ మీడియా రంగాలకు యాడ్స్ ఇచ్చి, వాటికి సంబంధించిన నగదు చెల్లింపులు చేయకపోవడంతో పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు బకాయిలు చెల్లించలేదని మీడియా ప్రతినిధులు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోసారి డిసెంబర్ సమీపిస్తున్న వేళ, కొత్త యాడ్స్ కోసం ఆ ఎమ్మెల్యేను సంప్రదించాలా వద్దా అనే ఆలోచనలో పాత్రికేయులు ఉన్నారట.ఇక మరోవైపు, అదే ఎమ్మెల్యే అధికార పార్టీపై బహిరంగంగా విమర్శలు చేస్తూ మీడియా ముందుకు రావడం ఆశ్చర్యంగా మారింది. “తన బకాయిలు తీర్చని ఎమ్మెల్యే, ఇతరులను విమర్శించడం ఏం న్యాయం?” అంటూ స్థానిక మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది.📍 ప్రకాశం జిల్లాలో ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

