Tv424x7
Telanganaలీగల్ విషయాలు

నల్గొండలో పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష..

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామానికి చెందిన గొర్ల సైదులుకు పోక్సో న్యాయస్థానం కఠిన తీర్పు వెలువరించింది.

2019లో మైనర్ బాలికను ఆటోలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించిన ఘటనలో సైదులు నిందితుడిగా తేలాడు.

బాలిక కేకలు వేయడంతో పరారైన అతనిపై తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

పూర్తి సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం కోర్టు నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది.

బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది.

Related posts

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

TV4-24X7 News

జూన్ 3 నుంచి19 వరకు బడిబాట కార్యక్రమాలు

TV4-24X7 News

స్థానిక ఎన్నిలకు వచ్చే వారం నోటిఫికేషన్ జారీ..!!

TV4-24X7 News

Leave a Comment