Tv424x7
Andhrapradesh

చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.

రాష్ట్రంపై మోంథా తుపాన్ ప్రభావం తీవ్రమవుతుందనే నేపథ్యంలో, కేంద్రం తరపున పూర్తి స్థాయి సహకారం అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు.

తుపాన్ సన్నద్ధతలు, కేంద్ర బృందాల సహకారం, పునరావాస చర్యలపై చంద్రబాబు – మోదీ టెలిఫోన్‌లో చర్చించినట్లు సమాచారం.

తాజాగా తీర ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఆకాశం మేఘావృతమై, సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది.వాతావరణ శాఖ హెచ్చరికలతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను ప్రభుత్వం ఇప్పటికే మోహరించింది.

తుపాన్ దాటిన వెంటనే విద్యుత్, రవాణా, రోడ్లు వంటి మౌలిక వసతుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది.

కేంద్రం కూడా అవసరమైన అన్ని సహాయాలు అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

తుపాన్ మోంథా ప్రభావాన్ని తగ్గించేందుకు రాష్ట్రం, కేంద్రం కలిసి కట్టుగా పనిచేస్తున్నాయి.

Related posts

చంద్రబాబు ఢిల్లీ టూర్‌తో వైసీపీలో ఉలిక్కిపాటు

TV4-24X7 News

అనంతపురం జిల్లా నాగిరెడ్డిపల్లెలో దారుణ ఘటన –

TV4-24X7 News

జనసేనలో చేరిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్

TV4-24X7 News

Leave a Comment