Tv424x7
Andhrapradesh

మొంథా తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష — ప్రధాని మోదీతో టెలిఫోన్‌లో చర్చ

అమరావతి:మొంథా తుఫాన్‌ ప్రభావం నేపథ్యంలో ఆర్టీజీఎస్‌ ద్వారా అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.

మొంథా తుఫాన్‌ ప్రస్తుతం కాకినాడకు 680 కి.మీ దూరంలో ఉంది.

గంటకు 16 కి.మీ వేగంతో తీరాన్ని సమీపిస్తున్నట్లు వాతావరణ శాఖ సమాచారం.

ఈరోజు, రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం.

గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే సూచన.

రేపు రాత్రి తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.• తుఫాన్‌ కదలికలను ప్రతి గంటా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు.

తుఫాన్‌ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడారు.

ప్రధాని కార్యాలయంతో సమన్వయం కొనసాగించాలని మంత్రి లోకేష్కు సీఎం సూచన.• వర్షాలు, వరదలు సంభవించే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.

కాలువ గట్లు బలోపేతం చేసి, పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

వరంగల్‌లో ఫారెస్ట్ బీట్ అధికారి సస్పెండ్… ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై సెర్చ్ వారెంట్

TV4-24X7 News

ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

TV4-24X7 News

Leave a Comment