Tv424x7
Andhrapradesh

15 ఏళ్లకే స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి మాలశ్రీ

15 ఏళ్లకే స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నటి మాలశ్రీ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఆమె సినిమాలకు థియేటర్ల వద్ద అభిమానులు భారీగా తరలివచ్చేవారు. తెలుగు, కన్నడ చిత్రసీమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాలశ్రీ, చిన్న వయస్సులోనే అగ్ర హీరోలతో నటించి స్టార్‌డమ్‌ను అందుకున్నారు.1973 ఆగస్టు 10న జన్మించిన మాలశ్రీ చిన్నప్పటి నుంచే సినిమాల్లోకి అడుగుపెట్టారు. బాలనటిగా పలు చిత్రాల్లో కనిపించిన ఆమె, హీరోయిన్‌గా కన్నడ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సంచలనం సృష్టించారు. ఆ తర్వాత వరుస విజయాలతో అక్కడ అగ్ర కథానాయికగా ఎదిగారు.తెలుగులోనూ ప్రేమఖైదీ, బావ బావమరిది, సాహసవీరుడు సాగరకన్య వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా ప్రేమఖైదీ సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపు తీసుకొచ్చింది. ఒక దశలో ఒకే ఏడాదిలో అనేక సినిమాల్లో నటించి రికార్డులు సృష్టించారు. యాక్షన్ పాత్రలు, లేడీ ఓరియెంటెడ్ కథల్లోనూ ఆమె ప్రత్యేక ముద్ర వేశారు.వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగిన మాలశ్రీ, ఇప్పటికీ సినీ రంగంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె కుమార్తె కూడా ఇప్పుడు చిత్రసీమలో అడుగుపెట్టి గుర్తింపు పొందుతోంది.

Related posts

గంగుల ఏ పార్టీ తరపున బరిలో దిగానున్నాడో

TV4-24X7 News

టీడీపీ భవిష్యత్ ప్రణాళికల కోసం లోకేష్ 6 శాసనాలు

TV4-24X7 News

రాజధానిలో ఆసక్తికర ప్లెక్సీలు.. ఎవరు పెట్టారబ్బా..?

TV4-24X7 News

Leave a Comment