కడప / ప్రొద్దుటూరు లోని ప్రసిద్ధ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి (అమ్మవారిశాల) ఆలయాన్ని మాజీ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి కూడా పాల్గొన్నారు.ఆలయ విశిష్టతను ఆర్యవైశ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి వివరించారు. అనంతరం ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు, పులివెందుల ఆర్యవైశ్య నాయకులు కరుణాకర్‌తో కలిసి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికి సత్కరించారు.దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, “విజయవాడ తరహాలో ప్రొద్దుటూరులో అభివృద్ధి జరగడం ఆనందంగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఆర్యవైశ్య సోదరులైన చిప్పగిరి ప్రసాద్, మారుతి ప్రసాద్‌లను తిరుమల దేవస్థానం డైరెక్టర్లుగా నియమించడంలో రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పాత్ర విశేషం” అని పేర్కొన్నారు.అనంతరం రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, “సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని” విమర్శించారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

