ఆదోని, జూన్: సమాజ సేవ పట్ల తన నిబద్ధతను చాటుతూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఆదోని వాసి శ్రీ చెంచు ప్రదీప్ గారు తన మొదటి జీతంతో కొనుగోలు చేసిన వాహనాన్ని ఇస్కాన్ ఆదోని సేవా కార్యక్రమాలకు విరాళంగా అందించారు.ఈ సందర్భంగా వాహనం తాళాలను శ్రీ చెంచు ప్రదీప్ గారి తల్లిదండ్రులు శ్రీ చుంచు రామకృష్ణ గారు, శ్రీమతి చుంచు సుజన గారు ఇస్కాన్ ఆదోని మేనేజర్ శ్రీ రూపానుగ దాస్ గారికి అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి హాజరైన వారు ప్రదీప్ గారి ఉదారతను అభినందించారు.మొదటి సంపాదనతో కొనుగోలు చేసిన వాహనాన్ని సేవా కార్యక్రమాలకు అంకితం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు ఈ వాహనం ఉపయోగపడనుంది.ఈ కార్యక్రమంలో శ్రీ గట్టు నాగరాజ్ గారు, ఆదోని ఆర్ట్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ శ్రీ చంద్రశేఖర్ గారు, మెతి డెవలపర్స్ అధినేత శ్రీ సుదర్శన్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

