Tv424x7
Andhrapradesh

మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా?: చంద్రబాబు

Chandrababu:అమరావతి: విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని చిట్టెంపాడుకు చెందిన మాదల గంగులు ఎదుర్కొన్న హృదయవిదారక సంఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు..గంగులు కుటుంబానికి జరిగిన దారుణం విని చలించిపోయానన్నారు. 5 కి.మీ. డోలీపై మోసుకొని వెళ్లడం దురదృష్టకరమని.. ఇలాంటి దుస్థితి రాకూడదనే గతంలో ఫీడర్‌ అంబులెన్సులు తీసుకొచ్చినట్లు చెప్పారు. వాటిని పక్కన పడేసి గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..”తల్లి, బిడ్డ చనిపోయేందుకు కారణం ప్రభుత్వ అలసత్వం కాదా? కనీసం మనిషి చనిపోయిన తర్వాతైనా ప్రభుత్వం కనికరించకపోతే ఎలా? ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని.. ఘటనపై విచారణ జరిపించాలి. చిట్టంపాడు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని చంద్రబాబు తెలిపారు..

Related posts

మీది బలిజ సంఘమా ? లేక వైస్సార్సీపీ అనుబంధ సంఘమా..?

TV4-24X7 News

వివేకానంద సంస్థ వారి ఆధ్వర్యంలో దుర్గమ్మ తల్లి పూజా కార్యక్రమం

TV4-24X7 News

తహసీల్దార్ సంతకం ఫోర్జరి..ఆరుగురిపై కేసు నమోదు..

TV4-24X7 News

Leave a Comment