Tv424x7
Andhrapradesh

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ – ఫిబ్రవరి 12కు వాయిదా వేసిన సుప్రీంకోర్ట్

*స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలుకు చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే 4 వారాల సమయం కోరారు. విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేయాలని విన్నవించారు. ఫిబ్రవరి 9న తనకు మరో పని ఉందని ప్రభుత్వ న్యాయవాది రంజిత్‌కుమార్‌ చెప్పగా…. ఫిబ్రవరి 12న విచారణ చేయాలని హరీష్ సాల్వే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు అక్టోబర్​ 31న మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన షరతులపై హైకోర్టు నవంబర్​ 20న స్పష్టత ఇచ్చింది. మధ్యంతర బెయిల్‌ షరతుల నెల28 వరకే వర్తిస్తాయని పేర్కొంటూ సాధారణ బెయిల్ మంజూరు చేసింది.

Related posts

ఇడమడక చెక్ పోస్ట్ వద్ద 30 లక్షల నగదు స్వాధీనం

TV4-24X7 News

తెదేపా అధినేత చంద్రబాబుతో పవన్‌కల్యాణ్‌ భేటీ

TV4-24X7 News

అవి గంజాయి చాక్లెట్లే

TV4-24X7 News

Leave a Comment