Tv424x7
Andhrapradesh

ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాలలో ప్రపంచ నీటి దినోత్సవం

కడప /పులివెందుల లోని “ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల” లో “ప్రపంచ నీటి దినోత్సవం” కార్యక్రమం శుక్రవారం 22 మార్చి జరిగింది. అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్.ఎస్.బేగ్ మాట్లాడుతూ నీటి ప్రాముఖ్యత మరియు నీరు వృధాను అరికట్టడం అంశాల గురించి తెలిపి, భావితరాలకు నీటి వనరులును అందించటం పౌరులుగా మన భాద్యత అని చెప్పారు మరియు నీటి సంరక్షణలో స్త్రీల పాత్ర చాల కీలకమైనది అని కొన్ని ఉదాహరణలు వివరించారు. ఈ సందర్భంగా స్టూడెంట్ ఆక్టివిటీ అధికారి డాక్టర్ రాజేష్ మరియు డాక్టర్ నివేదిత గారు నీటి ప్రాముఖ్యత గురించి కార్యక్రమంలో మాట్లాడారు. అనంతరం విద్యార్థులు నీరు సంరక్షణ గురించి క్లుప్తంగా కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్టూడెంట్ ఆక్టివిటీ అధికారి డాక్టర్ రాజేష్, అధ్యాపకులు డాక్టర్ కీర్తి రెడ్డి, డాక్టర్ జయమ్మ, డాక్టర్ నివేదిత, డాక్టర్ సాయి శ్రీనివాస్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాజశేఖర్, ఎన్. వి. సుబ్బారెడ్డి మరియు కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

రైతుల సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ ముఖ్య సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి

TV4-24X7 News

ఇజ్రాయెల్ కు భారీ షాక్.. సైన్యం పై హమాస్ ఆర్పీజీ లాంచర్

TV4-24X7 News

నేడు తిరుమల శ్రీవారి మే నెల టికెట్లు విడుదల

TV4-24X7 News

Leave a Comment