జగ్గంపేటలో సూపర్ బజార్‌లో ఎక్స్‌పైరీ బిస్కెట్ల విక్రయం?.. వినియోగదారుల ఆందోళన

కాకినాడ జిల్లా, జగ్గంపేట: జగ్గంపేటలోని పులవర్తి సూపర్ బజార్‌లో గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) బిస్కెట్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువు తేదీ ముగిసినప్పటికీ భారీ మొత్తంలో బిస్కెట్లను విక్రయానికి ఉంచినట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ విషయంపై ఒక వినియోగదారుడు యాజమాన్యాన్ని ప్రశ్నించగా, నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు ఆరోపించారు. అలాగే, తాను కొనుగోలు చేసిన సంతూర్ రాయల్ శాండల్ సబ్బుకు బదులుగా బిల్లులో సంతూర్ గోల్డ్గా నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇది వినియోగదారులను తప్పుదారి పట్టించే విధంగా బిల్లింగ్ చేస్తున్నారనే అనుమానాలకు తావిస్తోంది.

ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పందన లేకపోవడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సూపర్ మార్కెట్లలో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాన్ని అరికట్టి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆహార భద్రత శాఖ అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *