దువ్వూరులో ఎర్రచందనం స్మగ్లర్‌పై పోలీసుల కాల్పులు
అర్ధరాత్రి సోదాల్లో పోలీసులపై తిరగబడిన స్మగ్లర్..
కాల్పుల్లో జాకీర్‌కు గాయాలు, కానిస్టేబుల్‌కు కూడా గాయాలు
కడప జిల్లా: దువ్వూరు మండలంలోని జగనన్న కాలనీలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసులు అర్ధరాత్రి సోదాలు నిర్వహించారు. దువ్వూరు సమీపంలో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సోదాల సమయంలో జాకీర్ పోలీసులపై తిరగబడినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎస్ఐ చిన్న పెద్దయ్య ఆధ్వర్యంలో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనలో స్మగ్లర్ జాకీర్‌కు గాయాలు కాగా, ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు కూడా గాయాలైనట్లు సమాచారం. జాకీర్‌ను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
గాయపడిన పోలీస్ కానిస్టేబుల్‌ను మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. జాకీర్‌పై గతంలో చాపాడు పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: