సీపీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు

సీపీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

హైదరాబాద్: తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోయినా హైదరాబాద్‌లోని భవానీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ, సీఐ తన చేతులు, కాళ్లు కట్టేసి, కళ్లల్లో కారం చల్లి కొట్టారని తలాబ్ కట్టకు చెందిన షానవాజ్ ఆలం ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను హైకోర్టు ఆదేశించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఎలాంటి విచారణ చేపట్టలేదని షానవాజ్ ఆలం మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ ధిక్కరణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కోర్టు ఆదేశాలను అమలు చేయలేదన్న ఆరోపణలపై సీపీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

వెంటనే కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో పోలీసు శాఖ తరఫున వివరణ సమర్పించాల్సి ఉంటుంది.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *